కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ పై భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది బిజెపి. కర్ణాటకలోని హుబ్బలిలో సోనియా చేసిన వ్యాఖ్యలు ‘ విభజన’ స్వభావాన్ని కలిగి ఉన్నాయంటూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. దేశ వ్యతిరేక ప్రకటన చేసిన సోనియా గాంధీ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరింది. అంతేకాకుండా కాంగ్రెస్ అధికార ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోని కూడా ఫిర్యాదుకు బిజెపి జత చేసింది.
కావాలనే ప్రజలలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోనియాగాంధీ మాట్లాడారని బిజెపి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. 6.5 కోట్ల కర్ణాటక ప్రజలకు సోనియా గాంధీ తప్పుడు సందేశం ఇస్తున్నారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొంది బిజెపి. దేశం నుంచి కర్ణాటకను విభజించాలని కాంగ్రెస్ భావిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఆదివారం ఆరోపించారు. ఇదే అంశంపై బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.