మహిళల దుస్తులపై బిజెపి నేత వివాదాస్పద వ్యాఖ్యలు

-

మహిళల వస్త్రాధారణ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బిజెపి నేత కైలాష్ విజయ్. హనుమంతుడు, మహావీరుల జయంతి సందర్భంగా గురువారం ఇండోర్ లో ఏర్పాటు చేసిన మతపరమైన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కొంతమంది మహిళలు చెత్త దుస్తులు ధరించి సూర్పనఖలా కనిపిస్తుంటారని అన్నారు. రాత్రిపూట తాను కారులో వెళుతుంటే కొంతమంది యువతులు డ్రగ్స్ మత్తులో ఊగిపోతూ కనిపిస్తూ ఉంటారని.. వారిని చూస్తే వెంటనే వాహనం దిగి మత్తు దిగిపోయేలా చెంపలు వాయించాలని అనిపిస్తుందని వ్యాఖ్యానించారు.

దేవుడు మనకు అందమైన శరీరాన్ని ఇచ్చినందుకు మంచి దుస్తులు ధరించారని ఆయన సూచించారు. స్త్రీలపై విజయ్ వర్గీయా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్షాలు, నెటిజెన్లు ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు. బిజెపి నేతలు మహిళలను పదేపదే అవమానిస్తున్నారని, ఇది వారి ఆలోచనలను, వారి వైఖరిని తెలియజేస్తుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంగీత శర్మ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news