జ్యూస్ లో మూత్రం కలిపి విక్రయిస్తున్న ఇద్దరూ అరెస్ట్..!

-

జ్యూస్ లో మూత్రం కలిపి విక్రయిస్తున్నటువటి ఇద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ బోర్డర్  లో చోటు చేసుకుంది. జ్యూస్ ని విక్రయించే వ్యక్తి పండ్ల రసాల్లో మానవ మూత్రాన్ని కలిపి విక్రయిస్తున్నట్టు పలువురు వినియోగదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ జ్యూస్ విక్రయిస్తున్న వ్యక్తిని అమీర్ (29)గా గుర్తించారు పోలీసులు. జ్యూస్ స్టాల్ వద్ద నుంచి మూత్రం నింపి ఉంచిన డబ్బాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

ఈ విషయం పై అమీర్ ను విచారించి అరెస్ట్ చేసినట్టు అంకుర్ విహార్ ఏసీపీ భాస్కర్ వర్మ వెల్లడించారు. అతని వద్ద పని చేస్తున్న ఓ మైనర్ బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. నిందితుడి పై  చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేలోని ఛత్ముల్ పూర్ లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news