BSNL vs Jio Offers: బిఎస్ఎన్ఎల్ దెబ్బకు దిగొచ్చిన జియో.. నయా ఆఫర్ల ప్రకటన!

-

టెలికాం రంగంలో పోటీతత్వం విపరీతంగా పెరిగిపోయింది. ఇతర కంపెనీలపై పై చేయి సాధించేందుకు ఒకదానికి మించి మరొకటి ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. మన దేశంలో జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా, బిఎస్ఎన్ఎల్ టెలికాం సేవలను అందిస్తున్నాయి. వీటన్నిటి మధ్య ప్రధానంగా పోటీ జియో, ఎయిర్టెల్, వి.ఐ మధ్య కనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రస్తుతం వీటికి ధీటుగా ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ కూడా నిలుస్తోంది.

ఇటీవల దేశంలోని ప్రముఖ టెలికాన్ సర్వీస్ ప్రొవైడర్ జియో రీఛార్జ్ చార్జీలను భారీగా పెంచింది. దీంతో కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లక్షలాదిమంది యూజర్లు పోర్ట్ అయ్యారంటూ ఎన్నో కథనాలు కూడా వెలువడుతున్నాయి. దీంతో నష్ట నివారణకు దిగింది జియో. తాజాగా కొత్త వ్యాల్యూ యాడెడ్ రీచార్జ్ ప్లాన్లను ప్రకటించింది. సాధారణంగా కాల్స్, డేటా బెనిఫిట్స్ అందించే ప్లాన్స్ రేట్లు కనీసం రూ.180 నుంచి 200 మధ్య ఉంటాయి.

అయితే నెలకు కేవలం రూ.173 మాత్రమే వెచ్చించేలా రూ.1,889 ప్లాన్ ని జియో పరిచయం చేసింది. ఈ ప్లాన్ వాలిడిటీ 336 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ తో కస్టమర్లు దేశంలోని ఏ నెట్వర్క్ కి అయినా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ప్లాన్ తో అదనంగా 24 జీబీ ల హై స్పీడ్ డేటా కూడా లభిస్తుంది. ఇక ఏడాది కాకుండా కేవలం నెలవారి ప్లాన్ ని పొందాలనుకుంటే రూ. 189 రీఛార్జ్ చేయించుకోవలసి ఉంటుంది. ఈ ప్లాన్ కి అపరిమిత వాయిస్ కాలింగ్, ఉచిత రోమింగ్, నెలకు 300 ఉచిత ఎస్ఎంఎస్ లతో పాటు 2gb డేటా కూడా పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news