కొన్ని కొన్ని సార్లు కొన్ని బ్యాంకులు అధిక వడ్డీని అందిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకు నుంచి వడ్డీరేట్లతో ఫిక్స్డ్ డిపాజిట్లను ఆఫర్ చేస్తూ ఉంటాయి. మార్కెట్ ట్రెండ్స్ కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా ఖాతాదారులను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కీమ్స్ ని కూడా బ్యాంకులు తీసుకువస్తూ ఉంటాయి. తాజాగా ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక స్పెషల్ స్కీమును తీసుకొచ్చింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. 333 రోజుల టెన్యూర్ తో వచ్చే స్టార్ ధనవృద్ది FDని ఆకర్షణీయమైన వడ్డీ రేటుకి అందిస్తున్నట్లు బ్యాంకు చెప్పింది.
దీంతోపాటుగా మరికొన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్కీం కింద అన్ని వర్గాల కస్టమర్లకు బ్యాంక్ అత్యధిక వడ్డీ రేటును అందిస్తోంది. సూపర్ సీనియర్ సిటిజన్లకైతే మరిన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఈ స్కీమ్ లో భాగంగా 80 ఏళ్లకు పైగా వయసు ఉన్నవాళ్లు పెట్టుబడి పెడితే 7.9% వడ్డీ వస్తుంది. 60 నుంచి 80 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకైతే 7.75% వడ్డీ వస్తుంది. 60 ఏళ్లలోపు ఉన్న వాళ్ళకైతే 7.25% వడ్డీ వస్తుంది.
గరిష్టంగా ఈ స్కీంలో మూడు కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ బ్యాంక్ అందిస్తున్న ఇతరతో పోలిస్తే ఈ స్కీమ్ లోనే వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నాయి. మూడు కోట్ల లోపు పెట్టుబడితో రెండు నుంచి ఐదు ఏళ్లకు సీనియర్ సిటిజెన్స్ కి గరిష్టంగా 7.25% వడ్డీ వస్తుంది అదే సూపర్ సీనియర్ సిటిజల్లకైతే 7.4% వడ్డీ వస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించింది కొత్త వడ్డీ రేట్లు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.