ఇండియాలో కొత్తగా 1590 కరోనా కేసులు, 6 మరణాలు

ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు… ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1590 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,47,02,257 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 8,601 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 94. 12శాతంగా ఉంది.ఇక దేశంలోఆరుగురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 5,30,824 కి చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 910 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,41,62, 009 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2,20,65,34,826 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 1,19,560 మందికి కరోనా పరీక్షలు వేసింది ఆరోగ్య శాఖ.