లోక్సభ ఎన్నికల షెడ్యూల్ పై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ

-

లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా శుక్రవారం రోజున కేంద్ర హోంశాఖ, రైల్వే అధికారులతో సీఈసీ సమావేశమైంది. దేశవ్యాప్తంగా భద్రతా దళాల తరలింపు, మోహరింపు తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌తోపాటు జమ్ముకశ్మీర్‌కూ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై హోంశాఖ అధికారులతో సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది.

రానున్న లోక్సభ ఎన్నికల షెడ్యూల్కు సంబంధించి ఇటీవల సోషల్ మీడియాలో ఓ ప్రకటన చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రకటన నకిలీదని సీఈసీ స్పష్టం చేసింది. తాము ఇప్పటి వరకు తేదీలేవీ ప్రకటించలేదని పేర్కొంది. మార్చి 12వ తేదీ నుంచి ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తుందని ఎన్నికల సంఘం పేరిట ఓ నకిలీ లేఖను కొందరు వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నకిలీ ప్రకటనలో మార్చి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్‌ 19న పోలింగ్‌, మే 22న ఓట్ల లెక్కింపు, మే 30 నాటికి ప్రభుత్వ ఏర్పాటు అని ఉంది. అయితే ఈ ప్రకటన ఫేక్ అని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news