మోదీ పర్యటన ఎఫెక్ట్.. లక్షద్వీప్‌లో కొత్త విమానాశ్రయం!

-

 లక్షద్వీప్‌.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. మేడ్ ఇన్ ఇండియా.. మేక్ ఇండియా నినాదాన్ని మొదలెట్టిన ప్రధాని మోదీ ఇటీవల చేపట్టిన లక్షద్వీప్ పర్యటనతో మేక్ మై ట్రిప్ ఇన్ ఇండియా అనే నినాదం కూడా మార్మోగుతోంది. స్వదేశీ విహారయాత్రకు డిమాండ్ కూడా బాగా పెరుగుతోంది. మోదీ ఒక్క పర్యటనతో లక్షద్వీప్ దీవుల పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతోంది. పర్యాటకుల చూపు ఇప్పుడు ఈ దీవులపై పడటంతో నెటిజన్లు ఈ దీవుల కోసం నెట్టింట తెగ వెతికేస్తున్నారు.

ఈ దీవికి పర్యాటకుల తాకిడి పెరగనున్న నేపథ్యంలో కేంద్ర సర్కార్ అప్రమత్తమైంది. లక్షద్వీప్‌లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే అక్కడ కొత్తగా మరో విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ‘ఫైటర్‌ జెట్‌లు, సైనిక రవాణా ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పాటు వాణిజ్య విమానాల నిర్వహణ సామర్థ్యం ఉండేలా ద్వంద్వ ప్రయోజనాలతో కొత్తగా విమానాశ్రయాన్ని నిర్మించేందుకు కేంద్రం ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిసింది. మినికోయ్‌ దీవుల్లో ఈ విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news