బోరు బావిలో బాలుడు.. 100 గంటలు రెస్క్యూ చేసి రక్షించిన అధికారులు

-

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో జాంజ్ గిరి చంపా జిల్లాలో బోరుబావిలో పడిన బాలుడిని సురక్షితంగా రక్షించారు అధికారులు. ఏకంగా 104 గమటల పాటు సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి బాలుడి ప్రాణాలను కాపాడారు. జూన్ 10 శుక్రవారం రోజుల పెరట్లో ఆడుకుంటున్న రాహుల్ సాహు అనే 10 ఏళ్ల బాలుడు నిరుపయోగంగా ఉన్న బోరు బావిలో పడిపోయాడు. అప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నేషనల్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తో పాటు ఆర్మీ, కోల్ ఇండియా, స్థానిక పోలీస్, రెవెన్యూ యంత్రాంగం అంతా మోహరించారు. దాదాపుగా 500 మందికి పైగా సిబ్బంది కష్టపడి బాలుడిని రక్షించారు. 80 అడుగుల లోతు ఉన్న బోరు బావిలో పడిపోయాడు రాహుల్ సాహు. 60 అడుగుల లోతులో చిక్కుకుపోయాడు. బోరుబావికి సమాంతరంగా మరో గుంతను తీసి బాలుడిని రెస్క్యూ చేశారు. బాలుడు ఊపిరి పీల్చుకోవడానికి సహాయంగా ఆక్సిజన్ అందించారు. అయితే పూర్తిగా బండారాళ్లతో నిండిన ప్రాంతం కావడంతో సహాయ చర్యలు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డా.. 100 గంటలకు పైగా రెస్క్యూ చేసి బాలుడి ప్రాణాలు కాపాడారు అధికారులు. ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ రెస్క్యూ ఆపరేషన్ ను స్వయంగా పర్యవేక్షించారు. రెస్క్యూ అనంతరం బాలుడిని బిలాస్ పూర్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news