సిరిసిల్ల నియోజకవర్గానికే చెందిన ఎల్దండి వేణు తీసిన బలగం సినిమా చాలా బాగుందని, ఆ సినిమాలో బంధాలను, అనుబంధాలను చూపించిన తీరు అందర్నీ కన్నీరు పెట్టించిందని, ఈ సినిమాలో బంధాలతోపాటు పల్లె ప్రకృతిని చూపించారని మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం అసెంబ్లీలో పల్లె, పట్టణ ప్రగతిపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ… ఈ సినిమా షూటింగ్ మొత్తం వేములవాడ నియోజకవర్గంలోని కోనారావుపేటలో జరిగిందన్నారు. తానూ కుటుంబ సభ్యులతో పాటు ఈ సినిమాను చూశానని, ఈ సినిమాలో గ్రామంలో పల్లె ప్రకృతి కనిపించిందని కేటీఆర్ అన్నారు. సినిమాను చూసిన తన కుటుంబ సభ్యులు బలగంలో ఉన్న ఊరు కోనారావుపేటనా? కోనసీమనా? అని అడిగారని చెప్పారు.
ఇకపోతే, టికెట్ పై ఆశలు పెట్టుకున్న వారంతా కేసీఆర్ ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నా, ఆయన అపాయింట్మెంట్ లభించడం లేదు.దీంతో కేసిఆర్ తర్వాత పార్టీలో కీలకంగా ఉన్న మంత్రి కేటీఆర్ ను ఆశవాహులు కలిసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారిలో కొంతమందికి మాత్రమే కేటీఆర్ అపాయింట్మెంట్ ఇస్తున్నారు.దీంతో అపాయింట్మెంట్ దక్కిన నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఖాయం అని, అపాయింట్మెంట్ దక్కని వారికి టిక్కెట్ దక్కే ఛాన్స్ లేదనే ప్రచారం ఇప్పుడు బీఆర్ఎస్ లో జరుగుతోంది.