బీహార్ లో చెక్కులు అందజేసిన సీఎం కేసీఆర్

-

గల్వాన్ ఘర్షణల్లో వీర మరణం పొందిన భారత సైనికులు…సునీల్ కుమార్, కుందన్ కుమార్, అమన్ కుమార్,చందన్ కుమార్, జయ్ కిషోర్ ల కుటుంబాలకు, ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్ధిక సాయాన్ని చెక్కుల రూపం లో అందజేసారు ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు. ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్.

అలాగే హైదరాబాదులో జరిగిన అగ్నిప్రమాదం లో మరణించిన వలస కూలీల కుటుంబాలకు కూడా చెక్కులను అందజేశారు. సికిందర్ రామ్, దినేశ్ కుమార్, బిట్టూ కుమార్, దీపక్ రామ్, సత్యేంద్ర కుమార్, ఘటీ లాల్ రామ్, రాజేష్ కుమార్, అంకజ్ కుమార్ రామ్, ప్రేమ్ కుమార్, సిందు మహల్దార్, దామోదర్ మహల్దార్, రాజేష్ కుమార్ ల కుటుంబాలకు, ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్ధిక సాయాన్ని చెక్కుల రూపం లో, బీహార్ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో కలిసి అందజేసారు ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news