కరోనా కేసుల నేపథ్యంలోనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – కేజ్రీవాల్‌

-

ఢిల్లీలో కరోనా పరిస్థితులపై సిఎం కేజ్రివాల్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం కేజ్రివాల్ మాట్లాడుతూ.. కోవిడ్ కేసుల పెరుగుదలపై ఢిల్లీ దేశ వాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఢిల్లీ సర్కార్ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు. కోవిడ్ రోగుల కోసం ఢిల్లీ ఆసుపత్రుల్లో 7,986 పడకలు సిద్ధంగా ఉన్నాయి… ప్రభుత్వం వద్ద తగినంత ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయని తెలిపారు.

కోవిడ్ యొక్క XBB 1.16 వేరియంట్ వల్ల, ఢిల్లీ లో కేసులు సంఖ్య పెరుగుతోంది.. కొత్త వేరియంట్ వల్ల కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని తెలిపారు. వాక్సిన్ వేసుకున్న వాళ్లకు కరోనా సోకుతుంది.. నిన్న ఢిల్లీలో 295 కేసులు నమోదయ్యాయని వివరించారు. కొమొర్బిడిటీ లక్షణాలతో ఉన్న వాళ్ళు ముగ్గురు చనిపోయారు.. కరోనా కేసుల్లో కొత్త వేరియంట్ ను గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్స్ చేస్తున్నామన్నారు. కోవిడ్ రోగుల కోసం ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చెయ్యాలని ఢిల్లీ లోని ఆస్పత్రులను ఆదేశించామన్నారు అరవింద్ కేజ్రీవాల్.

Read more RELATED
Recommended to you

Latest news