అమరావతి రైతుల ఉద్యమంలో న్యాయం ఉందన్నారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. రాజధాని రైతుల ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా వారికి సంఘీభావం తెలిపారు. ధర్మం వారి వైపే ఉందని.. అమరావతి గెలుస్తుందని చెప్పారు. రైతుల పోరాట స్ఫూర్తిని చంద్రబాబు అభినందించారు. అమరావతి ఉద్యమం వైసీపీ ప్రభుత్వ ఆంక్షలు, వేధింపులు, సంకెళ్ళను ఎదిరించి ముందుకు సాగుతుందన్నారు.
అంతిమంగా గెలిచేది, నిలిచేది అమరావతేనని పేర్కొన్నారు చంద్రబాబు. ఇక కియా ఫ్యాక్టరీ పై గతంలో చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెబుతారా? అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు. కియా పై జగన్ గతంలో చేసిన వ్యాఖ్యలు, యువగళం పాదయాత్ర సందర్భంగా కియా పరిశ్రమ వద్ద లోకేష్ చేసిన ఛాలెంజ్ ను ప్రస్తావిస్తూ వీడియోని ట్వీట్ చేశారు చంద్రబాబు.
రాజధాని రైతుల 1200 రోజుల పోరాటానికి అభినందనలు. మీ ఉద్యమంలో న్యాయం ఉంది… మీ వైపే ధర్మం ఉంది. అందుకే ఆంక్షలు, వేధింపులు, సంకెళ్లను ఎదిరించి మీరు ముందుకు సాగుతున్నారు. అంతిమంగా గెలిచేది, నిలిచేది అమరావతే!#1200DaysOfAmaravatiProtests pic.twitter.com/3fjPR3yoJi
— N Chandrababu Naidu (@ncbn) March 31, 2023