దేశవ్యాప్తంగా ఈనెల 12న రాష్ట్ర రాజధానుల్లో కాంగ్రెస్‌ మౌన సత్యాగ్రహం

-

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వం రద్దు చేయటానికి బీజేపీ అనైతిక చర్యలకు పాల్పడినట్లు ఆ పార్టీ ఆరోపించింది. అందుకు నిరసనగా ఈనెల 12వ తేదీన దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర రాజధానుల్లోని గాంధీ విగ్రహాల వద్ద మౌన సత్యాగ్రహం నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్రభుత్వానికి రాహుల్‌ గాంధీ బలమైన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారని.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ అన్నారు.

భారత్‌ జోడో యాత్ర విజయవంతం తర్వాత లోక్‌సభలో రాహుల్‌ చేసిన చారిత్రాత్మక ప్రసంగంలో.. ప్రధాని మోదీ, అదానీ గ్రూప్‌ మధ్య సంబంధాలను బయటపెట్టారని వేణుగోపాల్‌ తెలిపారు. ఫలితంగా సభలో వాస్తవాలు మాట్లాడకుండా రాహుల్‌ పార్లమెంటు సభ్యత్వం రద్దు చేసేందుకు అనైతిక చర్యలకు పాల్పడినట్లు ఆరోపించారు. మోదీ ఇంటిపేరు కేసులో కిందికోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని రాహుల్‌ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను గుజరాత్‌ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో..సుప్రీం కోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news