నేటి నుంచి కాంగ్రెస్ “నవ సంకల్ప్ శిబిర్” సమావేశాలు

నేటి నుంచి కాంగ్రెస్ “నవ సంకల్ప్ శిబిర్” సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు (శుక్రవారం, మే 13) మధ్యాహ్నం 12 గంటల వరకు “నవ సంకల్ప్ శిబిర్” కి చేరుకోనున్న కాంగ్రెస్‌ నేతలు… మధ్యాహ్న భోజనం తర్వాత 2.10 గంటలకు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రారంభోపన్యాసం ఉండనుంది. సమావేశాలకు హాజరైన నేతలను ఆరు బృందాలుగా ఏర్పాటు చేయగా.. నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆరు అంశాలపై బృంద చర్చలు( Group Siscussions) జరుగనున్నాయి.

రేపు (శనివారం, మే 14) ఆసాంతం (రాత్రి 7.30 గంటల వరకు) బృంద చర్చలు జరుగనుండగా.. రేపు రాత్రి 8 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఆరు కమిటీల సమన్వయకర్తలు సమావేశాలు జరుగనున్నాయి. చివరి రోజు ( ఆదివారం, మే 15) ఉదయం 11 గంటలకు తీర్మానాలను ఆమోదం, ప్రకటనలను ఖరారు చేసేందుకు “ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ” సమావేశం నిర్వహించనున్నారు.

మధ్యాహ్నం 1 గంటకు “శిబిర్” కు హాజరైన నేతలతో “ఫోటో సెషన్”, తిరిగి ఆదివారం మద్యాహ్నాం 2.30 గంటలకు కాంగ్రెస్ నేతల సమావేశం ఉండనుంది. ఆ తర్వాత, మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగం ప్రారంభం కానుంది. “నవ సంకల్ప్ శిబిర్” సమావేశాల ముగింపు ఉపన్యాసం చేయనున్నారు సోనియా గాంధీ. ఆదివారం సాయంత్రం 4.15 గంటలకు జాతీయ గీతం ఆలాపన తో సమావేశాలు ముగియనున్నాయి.