దిల్లీలో 6 నెలల గరిష్ఠానికి కొత్త కేసులు..

-

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా 4 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయగా.. 20,551 కొత్త కేసులు వచ్చాయి. 70 మరణాలు సంభవించాయి. ముందురోజు కంటే కొద్దిమేర కొత్త కేసులు పెరిగాయి.

పాజిటివిటీ రేటు 5.14 శాతానికి చేరిందని శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే.. దిల్లీలో కరోనా కొత్త కేసులు అందోళన కలిగిస్తున్నాయి. అక్కడ 2,202 మందికి వైరస్ సోకింది. దాదాపు ఆరు నెలల తర్వాత అవే అత్యధికం. పాజిటివిటీ రేటు 11.84 శాతంగా నమోదైంది.

2020 ప్రారంభ నుంచి 4.41 కోట్ల మందికి కరోనా సోకగా.. 98.50 శాతం మంది వైరస్ నుంచి బయటపడ్డారు. నిన్న 21 వేల మంది కోలుకోగా.. కొత్తకేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. క్రియాశీల కేసులు 1.35 లక్షలు(0.31 శాతం)గా ఉన్నాయి. నిన్న 36.9 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇప్పటివరకూ 205 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news