క‌రోనా స‌మ‌యం.. శృంగారంలో పాల్గొనేవారికి సూచ‌న‌లు..

-

దేశంలో కరోనా సోకుతున్న వారి సంఖ్య రోజూ పెరిగిపోతోంది. ఈ వైరస్ మ‌న‌ల్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తోంది. అయితే కరోనా వైరస్ లైంగిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు సామాజిక దూరం పాటించ‌డం, మాస్క్‌ల‌ను ధరించడం, తరచుగా చేతులు కడుక్కోవడం, శుభ్రతను పాటించ‌డం వంటి ప‌నులు చేయాల‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో శృంగారంలో పాల్గొనాలా ? వ‌ద్దా ? అని అనేక మందికి సందేహాలు నెల‌కొన్నాయి.

corona samayamlo srungaram suchanalu

కాగా క‌రోనా స‌మ‌యంలో శృంగారంలో పాల్గొనాలా, వ‌ద్దా అనే విష‌యంపై ఇప్ప‌టి వ‌ర‌కు నిపుణులు ఏమీ చెప్ప‌లేదు. కానీ కొన్ని నియమాలను పాటించాలని చెబుతున్నారు. ఇక క‌రోనా సమయంలో లైంగిక సంబంధాలు బాగా త‌గ్గాయ‌ని లీజర్ సైన్స్ పత్రికలో వచ్చిన ఒక నివేదిక తెలియ‌జేసింది. ఇది ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంద‌ని నిపుణులు అంటున్నారు. అయితే వాస్త‌వానికి శృంగారం అనేది చ‌క్క‌ని వ్యాయామం. దీన్ని ఎవ‌రూ కాద‌న‌లేరు. ఇది వ్యక్తిలకు సంతృప్తిని ఇస్తుంది. ఒత్తిడి, ఆందోళనల‌ను తగ్గిస్తుంది. మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. మెదడులో ఎండార్ఫిన్లు, ఆక్సిటోసిన్లను విడుదల చేస్తుంది.

అధ్యయనాల ప్రకారం.. శారీరక సంబంధాలైన కౌగిలింత లేదా ముద్దు వ‌ల్ల కూడా ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదల అవుతాయి. ఇక ప్ర‌స్తుతం చాలా మంది ఒత్తిడితో స‌త‌మ‌తం అవుతున్నారు క‌నుక శృంగారంలో పాల్గొనడం వ‌ల్ల మూడ్ మారుతుంది. సంతోషంగా ఉంటారు. రిలాక్స్ అవుతారు. ఈ సందర్భంగా గుర్తుంచుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.

క‌రోనా స‌మ‌యంలో శృంగారంలో పాల్గొన‌వ‌చ్చు. అందుకు ఇద్ద‌రి స‌మ్మ‌తి ఉండాలి. ఇక శృంగారంలో పాల్గొన‌డానికి ముందు క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే శృంగారానికి దూరంగా ఉండాలి. అదే శృంగారం త‌రువాత క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే మీ భాగస్వామిని క‌రోనా టెస్టు చేయించుకోమ‌ని సూచించాలి. దీని వ‌ల్ల సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. ఇక శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు వీలైనంత వ‌ర‌కు కండోమ్ వాడ‌డం ఉత్త‌మం.

క‌రోనా అంటు వ్యాధి. క‌నుక శృంగారంలో పాల్గొనాల‌నుకునే వారు క‌రోనా విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఇది సుల‌భంగా వ్యాప్తి చెందుతుంది. క‌నుక శృంగారంలో పాల్గొనేవారు కరోనా ల‌క్ష‌ణాల‌పై క‌న్నేసి ఉంచాలి. ఇక దూరంగా ఉన్న‌ప్పుడు ఫోన్లు ఎలాగూ ఉన్నాయి క‌నుక ఫోన్ల ద్వారా వ‌ర్చువ‌ల్ శృంగారాన్ని ఆస్వాదించ‌వచ్చు. కానీ ఆ స‌మ‌యంలో ఫోన్‌లో రికార్డు అయ్యే డేటాతో జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేదంటే ఆ డేటా ఇత‌రుల‌కు చేరితే ప్ర‌మాదం. ఇలా క‌రోనా స‌మ‌యంలో భాగ‌స్వామితో చ‌క్క‌ని సంబంధాల‌ను క‌లిగి ఉండ‌వ‌చ్చు. దీని వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news