కరోనా పరిక్షలు ఎంత వేగంగా జరిగితే దేశంలో కరోనా వైరస్ అంత వేగంగా కంట్రోల్ అవుతుంది. అందుకే ఇప్పుడు పరీక్షలను అంత వేగంగా చెయ్యాలని భావిస్తున్నారు. దీని కోసం ఇతర దేశాల మీద ఆధారపడి టెస్ట్ కిట్స్ ని దిగుమతి చేసుకోవాలి అని భావిస్తుండగా చైనా లాంటి దేశం మోసం చేస్తుంది. దీనిపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన ఆగ్రహం వ్యక్తమవుతుంది. నమ్మి కొనుగోలు చేస్తే ఇలా చేయడం ఏంటీ అంటూ మండిపడుతున్నారు.
ఈ నేపధ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హర్ష వర్ధన్ కీలక ప్రకటన చేసారు. మే నెలాఖరుకు భారత్‌లోనే ఆర్‌టీ-పీసీఆర్, యాంటీ బాడీ టెస్ట్ కిట్లను ఉత్పత్తి చేస్తామని పేర్కొన్నారు. టెస్ట్ కిట్ల తయారీకి సంబంధించి అన్ని ప్రక్రియలు అధునాతన దశలో ఉన్నాయని, ఐసీఎంఆర్ నుంచి ఆమోదం లభించగానే టెస్టు కిట్ల ఉత్పత్తి ఆరంభిస్తామని ఆయన మంగళవారం మీడియా తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
మే 31కల్లా దేశంలో రోజుకు లక్ష పరీక్షలు చేయడమే లక్ష్యమని ఆయన వివరించారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న యాంటీబాడీ టెస్టు కిట్ల ఫలితాల్లో ఖచ్చితమైన ఫలితాలు రానందున వాటిని ఉపయోగించవద్దని ఇప్పటికే రాష్ట్రాలకు ఐసీఎంఆర్ సూచనలు చేసిన సంగతి తెలిసిందే. కిట్స్ ని వెనక్కు పంపాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది.