ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కరోనా వ్యాక్సిన్ లభ్యతపై కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రతిదీ అనుకున్నట్లు జరిగితే 2021 జనవరి నాటికి భారతదేశంలో సమర్థవంతమైన కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను ఆశించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఒక జాతీయ మీడియా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన… దేశంలో ఎప్పుడు వ్యాక్సిన్ లభిస్తుందో చెప్పడం చాలా కష్టమని అన్నారు.
ఇది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ట్రయల్స్ కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. అన్ని విషయాలు అనుకున్నట్లు జరిగితే, టీకా వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్లో లభిస్తుందని ఎయిమ్స్ డైరెక్టర్ తెలిపారు. అయితే దేశంలో ప్రజలకు కరోనా వ్యాక్సిన్ మోతాదులు సరిపోయే అవకాశం లేదని ఆయన అన్నారు. టీకా ప్రభావవంతంగా భావించిన తరువాత రెండవ సవాలు పంపిణీనే అన్నారు.