CSIR సెరో సర్వే: శాఖాహారులుకి, O బ్లడ్ గ్రూప్ వాళ్లకి, ధూమపానము చేసేవారికి కరోనా బారిన పడే అవకాశం తక్కువ ఉంది…!

-

కరోనా వైరస్ మహమ్మారి అయ్యి అందర్నీ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ కు సంబంధించిన చాలా విషయాలు మనం విన్నాం. అయితే ఇప్పుడు కరోనా గురించి మరి కొన్ని ఆసక్తికరమైన విషయాలు నిపుణులు చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… ధూమపానం చేసే వాళ్ళకి, శాఖాహారులుకి కి మరియు ‘O’ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి కరోనా వచ్చే అవకాశం తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సీఎస్ఐఆర్ కరోనా వైరస్ సెకండ్ వేవ్ కి సంబంధించి వ్యతిరేకంగా ఉండే యాంటీబాడీస్ గురించి స్టడీ చేశారు. కరోనాకి సంబంధించిన ఈ సర్వేకి సంబంధించి చూస్తే…140 మంది వైద్యులు మరియు శాస్త్రవేత్తల బృందం చేసిన ఈ అధ్యయనం లో 40 కి పైగా సిఎస్ఐఆర్ లేబరేటరీస్ లో 10,427 మంది మీద రీసర్చ్ చేసారు.

కరోనా వైరస్ రెస్పిరేటరీ సమస్య. స్మోకింగ్ చేయడం వల్ల మ్యూకస్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. అయినప్పటికీ కరోనా వైరస్ సంక్రమణ పై ధూమపానం మరియు నికోటిన్ యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి మరికొంత రీసర్చ్ అవసరమని అన్నారు. స్మోకింగ్ ఆరోగ్యానికి తీవ్రంగా హానికరం మరియు ఇతర వ్యాధులకు కూడా దారితీస్తుంది. అయితే ఈ పరిశోధనలు ఆమోదంగా తీసుకోకూడదు.

ఇదిలా ఉంటే శాకాహారులు ఎక్కువగా ఆహారం లో ఫైబర్ తీసుకుంటూ ఉంటారు. ఫైబర్ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. దీని కారణంగా కూడా కరోనా వచ్చే ఛాన్స్ తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక ‘O’ బ్లడ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి సంబంధించి చూస్తే… బి మరియు ఏబీ బ్లడ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి కరోనా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏబీ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి సెరో పాజిటివిటీ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఏ బ్లడ్ గ్రూపు వాళ్లకి కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ ‘O’ బ్లడ్ గ్రూపు వాళ్లకి వీళ్ళతో పోల్చుకుంటే తక్కువగా ఉంటుంది. కనుక కరోనా బారిన పడడానికి రిస్కు చాలా తక్కువగా ఉంటుంది.

COVID-19 కు సంబంధించి అమెరికాలోని 7,000 మందికి పైగా పరీక్షించిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) అధ్యయనం కూడా ఇలాంటి ఫలితాలను కనుగొంది. అదే విధంగా, యుకెఎల్ (యూనివర్శిటీ కాలేజ్ లండన్) విద్యావేత్తలు యుకె, చైనా, ఫ్రాన్స్ మరియు యుఎస్ అంతటా చేసిన పరిశోధనలో ధూమపానం చేసే వాళ్లకి రిస్క్ తక్కువ ఉందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news