ఎప్పటికైనా లేస్తాడనే నమ్మకంతో ఏడాదిన్నరగా ఇంట్లోనే మృతదేహం..

-

మన వాళ్లు మనల్ని వదిలిపోయారు అనే నిజాన్ని నమ్మడం చాలా కష్టంగానే ఉంటుంది కానీ.. టైమ్‌ వచ్చినప్పడు ఏదీ ఆగదు..వాస్తవాన్ని అంగీకరించాల్సిందే.. కుటుంబంలో ఎవరైనా చనిపోతే బాధ ఉంటుంది. వాళ్లు ఇక తిరిగిరారు. ఆరోజే వారిని భౌతికంగా చూడగలుగుతాం..ఆ తర్వాత నుంచి ఫోటోల్లో తప్ప డైరెక్టుగా చూడలేం.. అయితే ఓ కుటుంబం మాత్రం చనిపోయిన వ్యక్తి శవాన్ని ఏడాదిన్నరగా ఇంట్లోనే ఉంచుకున్నారు. మళ్లీ బతికి వస్తాడని బలంగా నమ్మారు..చివరకు ఏం జరిగిందంటే…

యూపీలోని కాన్పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. గత సంవత్సరం ఏప్రిల్‌లో కాన్పూర్‌లోని ఆదాయ పన్ను శాఖ కార్యాలయంలో పనిచేసే విమలేశ్ అనారోగ్యంతో చనిపోయారు. అయితే, ఆసుపత్రి నుంచి ఆయన మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చిన తరువాత కుటుంబ సభ్యులకు ఆయన బతికే ఉన్నాడని అనుమానం వచ్చింది.. దాంతో ఆయన కోమాలో ఉన్నాడని, ఎప్పటికైనా మళ్లీ లేస్తాడని బలంగా నమ్మారు. దాదాపు ఏడాదిన్నరగా వారు ఇదే విశ్వాసంతో ఉన్నారు. బంధు మిత్రులకు కూడా అలానే అనుకున్నారు.

ఈ క్రమంలో యూపీ సీఎం ఆఫీస్‌కు ఇటీవల ఒక లేఖ వచ్చింది. దాంతో స్థానిక పోలీసు అధికారులతో కలిసి, ఆరోగ్య శాఖ అధికారులు వారి ఇంటికి వెళ్లారు. వారు ఎంత సర్ది చెప్పినా కుటుంబ సభ్యులు వినలేదు. ఆసుపత్రిలో పరీక్ష జరిపిద్దామని చెప్పి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులతో పరీక్ష చేయించి, ఆ వ్యక్తి చనిపోయినట్లు కుటుంబ సభ్యుల ముందే నిర్ధారించారు. దాంతో ఆ మృతదేహాన్ని ఖననం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. మృతదేహాన్ని పూర్తిగా వస్త్రాలతో కప్పారని, మృతదేహానికి కొన్ని రసాయనాలు కూడా పూసినట్లుగా కూడా తెలుస్తోందని వైద్యులు వెల్లడించారు. అందువల్లే మృతదేహం నుంచి దుర్వాసన రాలేదని తెలిపారు.

ఇప్పటికైనా అధికారులకు విషయం తెలిసింది కాబట్టి సరిపోయింది..లేకుంటే వారు ఇంకా ఎప్పటికైనా లేస్తాడనే నమ్మకంతో ఎన్ని సంవసత్సరాలు ఎదురుచూసేవాళ్లో పాపం..! మృతదేహంతో ఏడాదిన్నర ఉన్నారంటే పెద్ద విషయమే..!ఎన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మృతదేహం కుళ్లకుండా ఉంటుంది..!

Read more RELATED
Recommended to you

Latest news