ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటాకు బెదిరింపులు

-

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటాకు బెదిరింపులు ఎదురయ్యాయి. ముంబయి పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి.. రతన్‌ టాటా ప్రాణానికి ముప్పు ఉందని హెచ్చరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. టాటా భద్రతను పెంచాలని లేదంటే ఆయనకు కూడా సైరస్‌ మిస్త్రీలాగే అవుతుందని పేర్కొన్నట్లు చెప్పాయి. రతన్‌ టాటాకు ఈ బెదిరింపులు ఈ వారం ఆరంభంలోనే రాగా ఆలస్యంగా ఈ విషయం బయటకు వచ్చింది.

బెదిరింపులతో అప్రమత్తమైన పోలీసులు రతన్‌ టాటాకు భద్రతను పెంచారు. టాటా ఇంటి సమీపంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తూ పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాల్‌ చేసిన వ్యక్తి గురించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కర్ణాటక నుంచి ఆ ఫోన్‌ వచ్చినట్లు గుర్తించి నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. నిందితుడిని పుణెకు చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు కొద్ది రోజుల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయిన అతడు కర్ణాటక నుంచి ముంబయి పోలీసులకు ఫోన్‌ చేసినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించాయి

Read more RELATED
Recommended to you

Latest news