దీపావళి ఎఫెక్ట్.. దిల్లీలో మరింత క్షీణించిన గాలి నాణ్యత

-

దిల్లీలో గాలి నాణ్యత మరింత క్షీణించింది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా దీపావళికి టపాసులు కాల్చకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎప్పటిలాగే అక్కడి కొందరు ప్రజలు ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తూ బాణాసంచా కాల్చారు. తీవ్ర వాయు కాలుష్యానికి కారణమయ్యారు. మరోసారి దిల్లీ వాసులు విషపూరితమైన గాలిని పీల్చే దుస్థితిని కల్పించారు.

దిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం మరింత తీవ్రమైంది. గాలి నాణ్యత సూచీ ‘తీవ్రమైన’ స్థాయికి పడిపోయింది. పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత ‘అతితీవ్ర’ కేటగిరీలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వులను దిల్లీ వాసులు ఖాతరు చేయకుండా బాణాసంచా కాల్చడం వల్ల.. దిల్లీలో వాయు నాణ్యత సూచీ (AQI) 323 పాయింట్లుగా నమోదైంది.  గడిచిన నాలుగేళ్లతో పోలిస్తే ఈ దీపావళి తర్వాత దిల్లీలో కాలుష్యం స్థాయి తక్కువగానే ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news