ఢిల్లీలో అల్లర్లు…. పలు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత

-

ఢిల్లీలో హనుమాన్ జయంతి సందర్భంగా జహంగీర్ పూరి ఏరియాలో మతఘర్షణలు చోటు చేసుకున్నాయి. హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాతావరణం ప్రశాంతంగా ఉందని… ఎలాంటి పుకార్లను నమ్మవద్దని అధికారులు కోరుతున్నారు. నిన్న జరిగిన హనుమాన్ శోభాయాత్రలో సామాన్యులతో పాటు పోలీసులు కూడా గాయపడ్డారు. 8 మంది పోలీసులు, 1 పౌరుడు సహా 9 మంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక సబ్ ఇన్‌స్పెక్టర్‌కు బుల్లెట్ గాయమైంది. అయితే నిన్న జరిగిన అల్లర్ల విషయంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు కారణం అయిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో సరిహద్దులో ఉన్న ఉత్తర్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. మీరట్ వంటి ప్రాంతాల్లో భద్రతను పెంచారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మత ఘర్షణలు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. ఆప్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news