బ్రిజ్ భూష‌ణ్ ఇంటికి పోలీసులు.. 12 మంది నుంచి వాంగ్మూలం

-

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటోన్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌పై కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇవాళ ఆయన ఇంటికి దిల్లీ పోలీసులు చేరుకోవడంతో కేంద్రం చర్యలు ఉపక్రమించినట్లు భావిస్తున్నారు. విచారణ నిమిత్తం ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండాలోని ఆయన ఇంటివద్దకు వెళ్లారని తెలిసింది.

దానిలో భాగంగా రెజ్లర్లు చేసిన ఆరోపణలకు సంబంధించి 12 మంది వాంగ్మూలం రికార్డు చేశారు. అంతేగాకుండా బ్రిజ్‌భూషణ్‌ మద్దతుదారులను కొందరిని ప్రశ్నించారు. ఇందులో భాగంగా ఎంపీని ప్రశ్నించారో లేదో తెలియాల్సి ఉంది. ఇక ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటివరకూ 137 మంది వాంగ్మూలాలను రికార్డు చేసినట్లు సంబంధిత వర్గాల వెల్లడించాయి.

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా పనిచేసిన బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన రెజ్లర్లు కొద్దినెలలుగా దిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగా ఆరుగురు మహిళా రెజ్లర్లతో మొదటి ఎఫ్‌ఐఆర్‌, మరో మైనర్‌ రెజ్లర్‌ తండ్రి ఫిర్యాదుతో రెండో ఎఫ్‌ఐఆర్‌ ఏప్రిల్‌ 28న దాఖలైంది.

Read more RELATED
Recommended to you

Latest news