మోడెర్నా టీకా ధర ఎంతో తెలుసా..?

-

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే అన్ని దేశాలు వ్యాక్సిన్లు అభివృద్ధి చేసి మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కూడా ముగించుకున్నాయి. అయితే ఇప్పటికే ప్రముఖ ఔషధ తయారీ సంస్థ మోడెర్నా కూడా వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. అయితే మోడెర్నా టీకాకు సంబంధించి ధర ఎంత ఉంటుందనే విషయంపై సంస్థ స్పష్టతను ఇచ్చింది.

moderna
moderna

మోడెర్నా టీకా ఒక్కో డోసుకు ప్రభుత్వాల నుంచి 25 డాలర్ల నుంచి 37 డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని సంస్థ వెల్లడించింది. సాధారణంగా ఫ్లూకి ఇస్తున్న వ్యాక్సిన్ కు 10 డాలర్ల నుంచి 50 డాలర్లు వసూలు చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ కూడా ఈ టీకా ధరల పరిధిలోనే ఉంటుందని మోడెర్నా సంస్థ సీఈఓ స్టిఫానీ బాన్సెల్ జర్మనీకి చెందిన ఓ ప్రముఖ పత్రికకు తెలిపారు.

మోడార్నా టీకాతో కరోనా వైరస్ పై సమర్థవంతంగా పోరాటం చేయోచ్చని సంస్థ వెల్లడించింది. ఈ మేరకు టీకా కొనుగోలుకు ఇప్పటికే పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ మేరకు సోమవారం ఐరోపా సమాఖ్య (ఈయూ) దేశాలు మోడెర్నాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మోడెర్నా టీకాను 25 డాలర్ల కంటే తక్కువగా వసూలు చేస్తే మిలియన్ల డోసులు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినట్లు బన్సెల్ తెలిపారు. ఈ మేరకు ఈయూ కమిషన్ సుముఖత చూపినా ఇంకా స్పష్టత రాలేదని వెల్లడించారు.

మూడోదశ క్లినికల్ ట్రయల్స్ లో మోడెర్నా రూపొందించిన ఎంఆర్ఎన్ఏ-1273 వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తోందని ఇటీవల సంస్థ ప్రకటించింది. త్వరలోనే ఈ టీకాను ఐరోపా ప్రజలకు అందించేందుకు సానుకూల ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. మొదటి మధ్యంతర విశ్లేషణలో భాగంగా 94.5 శాతం సమర్థతతో వ్యాక్సిన్ పని చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ముందస్తుగా నిర్ణయించిన ప్రమాణాలకు అనుగుణమైన సమర్థతను తమ వ్యాక్సిన్ చేరుకుందని మోడెర్నా సంస్థ సీఈఓ స్టిఫానీ బాన్సెల్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news