భూప్రకంపనల మధ్యే సర్జరీ చేసిన వైద్యులు.. వీడియో వైరల్

-

హిందూకుష్ పర్వతాల్లో వచ్చిన భూకంపం ప్రభావం ఉత్తర భారతదేశంపై తీవ్రంగా పడింది. ముఖ్యంగా జమ్ము కశ్మీర్, దిల్లీ వంటి ప్రాంతాల్లో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపించింది. కొన్ని సెకన్లపాటు వచ్చిన ప్రకంపనలతో ఉత్తర భారత్‌లో పలు భవనాలు దెబ్బతిన్నాయి. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగుతీశారు.

కానీ కశ్మీర్‌లోని ఓ ఆసుపత్రిలో అదే సమయంలో వైద్యులు సి-సెక్షన్ నిర్వహిస్తున్నారు. దాంతో ఆపరేషన్ రూమ్‌లోనూ ఆ కదలికలు కనిపించాయి. అయినా వైద్యులు సర్జరీని కొనసాగించారు. దీనికి సంబంధించిన దృశ్యాలను అనంత్‌నాగ్ జిల్లా యంత్రాంగం ట్విటర్‌లో పోస్టు చేసింది.

‘అనంత్‌నాగ్‌లోని ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఆపరేషన్‌ చేస్తున్నారు. అప్పుడే భూకంపం వచ్చింది. దాని ప్రభావం గదిలోనూ కనిపించింది. వైద్య సామగ్రి, ఓవర్‌హెడ్‌ లైట్స్‌, మానిటర్‌, ఐవీ డ్రిప్ స్టాండ్‌ ఊగడం ప్రారంభించాయి. అప్పుడే ఓ వ్యక్తి దేవుడికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. బిడ్డను సురక్షితంగా ఉంచు.. అని మధ్యలో ఓ వైద్యుడు మాట్లాడటం వినిపిస్తోంది. సరిగ్గా ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అప్పుడు అక్కడ మానిటర్ వెలుగు మాత్రమే ఉంది. కొన్ని సెనన్ల పాటు ఈ అంతరాయం కొనసాగినప్పటికీ.. వైద్యులు కంగారు పడకుండా తమ పని పూర్తి చేశారు. ‘సమస్యేం లేదు. అంతా ఓకే’ అంటూ మరొకరు రిలాక్స్‌ అయ్యారు’.. అంటూ ట్విటర్ పోస్టులో రాసి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news