మత మార్పిడులను రాజకీయం చేయవద్దని సూచించింది సుప్రీం కోర్ట్ ధర్మసనం. మతమార్పిడి అనేది తీవ్రమైన సమస్య అని.. అది రాజకీయ రంగు పులుముకోకూడదని వ్యాఖ్యానించింది. మోసపూరిత మతమార్పిడులను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్రాలకు దిశా నిర్దేశం చేయాలని దాఖలైన పిటిషన్ పై అటార్నీ జనరల్ వెంకటరమణి సహాయాన్ని సోమవారం న్యాయస్థానం కోరింది.
ప్రలోభాలతో మతమార్పిడులు జరిగితే ఏం చేయాలి? దిద్దుబాటు చర్యలు ఏమిటి? అనే అంశాలపై అటార్నీ జనరల్ చెప్పాలని ధర్మాసనం కోరింది. విచారణ ప్రారంభంలో తమిళనాడు తరపు సీనియర్ న్యాయవాది విల్సన్ ఈ పిటిషన్ ను రాజకీయ ప్రేరేపిత పిల్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అలాంటి మార్పిడుల ప్రశ్న లేదని అన్నారు విల్సన్.