బెంగళూరులో ఐటీ ఉద్యోగులకు నీటి కష్టాలు

-

వేసవి ప్రారంభమైన మార్చిలోనే దేశంలోని పలు నగరాల్లో నీటి కొరత ఏర్పడింది. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో నీటి సంక్షోభంతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్య ఐటీ ఉద్యోగులపై తీవ్రప్రభావం పడింది. దాహార్తి వెంటాడుతుండటంతో నీటి క్యాన్లు చేతపట్టుకుని గంటల తరబడి ఆర్‌ఓ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. దీనివల్ల కార్యాలయాలకు వెళ్లి పని చేయలేని పరిస్థితి ఏర్పడుతోందని ఐటీ ఉద్యోగులు వాపోతున్నారు.

మరోవైపు నీటి కష్టాలు ప్రముఖ ఐటీ కంపెనీలపై పడింది. ఐటీ ఉద్యోగులు తమ దాహార్తి కేకలు, బాధలు, ఇబ్బందులను సామాజిక మాధ్యమాల్లో స్నేహితులతో పంచుకుంటున్నారు. కొన్ని వారాలపాటు వివిధ కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానానికి అనుమతించక తప్పడం లేదు. కొందరు టెక్కీలు కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊర్లకు పయనమయ్యారు. నీటి కోసం ట్యాంకర్లను బుకింగ్‌ చేస్తే అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. 25 లీటర్ల నీటి డబ్బాలతో ఎక్కువ మంది టెక్కీలు ఉదయాన్నే శుద్ధీకరణ కేంద్రాల వద్ద ఎదురుచూస్తున్న దృశ్యాలు సర్వసాధారణంగా మారాయి. అనేక అపార్ట్‌మెంట్లలో నీటి రేషన్‌ వ్యవస్థను అమలులోకి తెచ్చారు. ఎక్కువగా వాడితే జరిమానా విధిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news