అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం

-

ఇటీవలే నేపాల్‌లో సంభవించిన భూకంపం భారత్‌లోనూ ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే భారత్‌లో స్వల్ప భూకంపం వచ్చింది. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో స్వల్పంగా భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ తెల్లవారుజామున 2.29 గంటల సమయంలో పోర్ట్‌బ్లేయిర్‌లో భూమి కంపించిందని వెల్లడించారు. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 4.3గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ పేర్కొంది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని చెప్పింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.

బుధవారం తెల్లవారుజామున నేపాల్‌తోపాటు ఉత్తర భారతంలోని చాలా ప్రాంతాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. నేపాల్‌లో 6.6 తీవ్రతతో భూ కంపం వచ్చింది. దీంతో దోతి జిల్లాలో ఇండ్లు కూలడంతో ఆరుగురు మరణించారు. ఇక ఉత్తరాఖండ్‌లో బుధవారం ఉదయం 6.30 గంటలకు 4.3 తీవ్రతతో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. దిల్లీతో పాటు ఉత్తర ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news