మనీలాండరింగ్ కేసులో.. తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్ట్​

-

తమిళనాట ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మనీలాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్​ శాఖ మంత్రి వి.సెంథిల్​ బాలాజీని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. మంగళవారం రోజున ఆయన్ను విచారించిన ఈడీ.. చివరకు అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. మంగళవారం రోజున తమిళనాడు సచివాలయంలోని సెంథిల్ బాలాజీ కార్యాలయంతో సహా, చెన్నైలో మంత్రి ఇంట్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేశారు.

తరువాత మంత్రిని సుదీర్ఘ కాలం పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు.. అర్ధరాత్రి తరువాత ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఆయనను ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి, కస్టడీ కోరే అవకాశం ఉంది. ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ అధికారులు సెంథిల్​ బాలాజీనిని టార్చర్​ చేయడం వల్లనే.. ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని డీఎంకే పార్టీ నేతలు ఆరోపించారు.

అంతకుముందు మంత్రి వి.సెంథిల్​ బాలాజీని వైద్య పరీక్షల కోసం చెన్నై ఒమండూర్​ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో మంత్రి తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news