పిల్లల భవిష్యత్తు కోసం సూపర్ స్కీమ్స్.. పూర్తి వివరాలు ఇవే..!

-

ప్రతీ ఒక్కరు కూడా లైఫ్ లో ఎలాంటి బాధలు లేకుండా ఉండాలని అనుకుంటారు. అలానే వాళ్ళ పిల్లలు కూడా బాగా పైకి రావాలని పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనుకుంటారు. మీరు కూడా అదే అనుకుంటున్నారా..? భవిష్యత్తు లో పిల్లల చదువులు, అనుకోని అవసరాలు తీర్చేందుకు ఈ డబ్బులు అవసరం అవుతాయి. అందుకోసం ముందు నుంచి ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యం. ఇక ఈరోజు మనం బెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌స్ గురించి చూసేద్దాం. మరి ఇక పూర్తి వివరాల లోకి వెళ్ళిపోదాం. సేవింగ్స్‌ స్కీమ్‌లలో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ కూడా ఒకటి. ఇన్వెస్టర్లకు ట్యాక్స్‌ బెనిఫిట్స్‌ ని ఈ స్కీము ఇస్తోంది. 7 శాతం వడ్డీ రేటును ఈ స్కీము తో ఇస్తోంది.

ఇన్వెస్ట్‌మెంట్‌కి గరిష్ట పరిమితి లేదు. కనీస పెట్టుబడి రూ.100. రూ.1.50 లక్షల వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో పెట్టవచ్చు. డిపాజిట్‌లపై సెక్షన్ 80C కింద ట్యాక్స్‌ డిడక్షన్‌ క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌ కాలపరిమితి వచ్చేసి ఐదేళ్లు. మెచ్యూరిటీ సమయంలోనే వడ్డీ పొందే అవకాశం ఉంటుంది. అలానే రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా మంచిగా రాబడిని ఇస్తాయి. ఇవి లో-రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్‌లు. సురక్షితమైనవి. పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్‌ చేయడానికి అనుకూలంగా ఉంటాయి ఇవి. సావరిన్ గోల్డ్ బాండ్స్ కూడా మంచిదే.

వోలటైల్‌ మార్కెట్‌ల వల్ల నష్టపోకుండా స్థిరమైన ఆదాయం పొందేందుకు దీని ద్వారా అవుతుంది. మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి పథకం లాంచ్‌ చేసింది దానిలో అయినా డబ్బులు పెట్టచ్చు. కుమార్తెకు 10 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఓపెన్ చేయచ్చు. దీనిలో కనీసం రూ.1000, గరిష్ఠంగా రూ.1.5 లక్షలు డిపాజిట్‌ చేయవచ్చు. PPF అకౌంట్‌ ని కూడా ఓపెన్ చేయచ్చు. కనీసం రూ.1 లక్ష ఇన్వెస్ట్‌ చేసేలా చూసుకోవాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news