మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసారా దర్శకుడు వశిష్ఠతో తన 156 సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి ‘విశ్వంభర’ అనే టైటిల్ ని అనౌన్స్ చేస్తూ.. సినిమా కాన్సెప్ట్ టీజర్ ని చిత్ర బృందం రిలీజ్ చేశారు. ఆల్రెడీ ఈ చిత్రం మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమాని దాదాపు 75 శాతం VFX పైనే తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.
అయితే.. ఈ చిత్రం కోసం ఇప్పుడు మెగాస్టార్ ఇచ్చిన ఓ సాలిడ్ అప్డేట్ మెగా ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. ఈ చిత్రంకోసం తాను ప్రత్యేకంగా జిమ్ లో కసరత్తులు చేస్తూ, స్వేదాన్ని చిందిస్తూ బాస్ కనిపించారు. మెయిన్ గా ఈ ఏజ్ లో కూడా ఇంత డెడికేట్ గా జిమ్ లో కష్టపడుతుండడం మెగా ఫ్యాన్స్ కి మరింత సంతోషాన్ని కలిగిస్తుంది. దీనితో చిరు నుంచి వచ్చిన ఈ సర్ప్రైజింగ్ వీడియో చూసి మాత్రం అంతా వావ్ అంటున్నారు. ఇక ఈ వీడియోతోనే విశ్వంభర కోసం తాను సిద్ధం అంటూ సాలీడ్ అప్డేట్ ని కూడా కన్ఫర్మ్ చేశారు.