అరుదైన రికార్డ్ సాధించిన గోవా, ఇండియాలోనే మొదటి స్టేట్

-

గోవా రాష్ట్రం అరుదైన రికార్డ్ సాధించింది. 2.30 లక్షల గృహాలను కలిగి ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో 100% పంపు నీటి కనెక్షన్లు అందించడం ద్వారా గోవా దేశంలో మొట్టమొదటి ‘హర్ ఘర్ జల్’ రాష్ట్రంగా అవతరించింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటన చేసింది. 2024 నాటికి అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గృహాలకు ట్యాప్ నీటిని అందించాలని ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ లక్ష్యంగా పెట్టుకుంది.

జల్ జీవన్ మిషన్ (జెజెఎం) ను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం వల్ల కలిగే అపారమైన ప్రయోజనాలను వివరిస్తూ… ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గోవాలో అన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో గ్రామీణ ప్రాంతాలకు ఈ పథకం అందించారు. కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ 2021 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 100% పంపు నీటి కనెక్షన్లను అందించే రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళికపై సావంత్ కు ఒక లేఖరాశారు

Read more RELATED
Recommended to you

Latest news