మహారాష్ట్ర లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్

-

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ తాజాగా విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 99 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. తమ పార్టీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్ పూర్ సౌత్ వెస్ట్ నుంచి బరిలో నిలిచారు. నవంబర్ 20న ఒకే విడుతలో మహారాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.

బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్ కులే కామరీ నియోజకవర్గం నుంచి పోటీలో
ఉంటారు. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ కుమార్తె శ్రీజయ చవాన్ భోకర్ నియోజకవర్గం
నుంచి పోటీ చేయనున్నారు. శివసేన,ఎన్సీపీలతో కలిసి మహాయుతి కూటమిగా ఏర్పడి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 20న పోలింగ్ జరిగితే..  నవంబర్23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news