సాధారణంగా సర్కార్ బ్యాంకులకు పండుగ వేలలు, పబ్లిక్ హాలిడేస్ అప్పుడు సెలవులు ఉంటాయి. ఇక నెలలో రెండు, నాలుగో శనివారం కూడా సెలవే. అయితే తాజాగా ప్రభుత్వ బ్యాంకులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నాయి. సర్కార్ బ్యాంకుల్లో పని చేసే ఉద్యోగులకు ఓ బంపర్ ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించాయి. అదేంటంటే..?
ఇక నుంచి ప్రభుత్వ బ్యాంకులు వారి ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిని అనుమతించనున్నాయి. త్వరలో ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వారానికి ఐదు రోజుల పని పద్ధతిని ఇంతకుముందే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (యూఎఫ్‌బీఈ) సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చాయి.
ఫైవ్ డే వర్క్ వీక్‌కు బదులుగా బ్యాంక్ సిబ్బందికి రోజుకు 40 నిముషాలు పనివేళలు పెరుగుతాయి. ప్రస్తుతం బ్యాంక్ ఉద్యోగులు రెండో, నాల్గో శనివారాలు సెలవు తీసుకుంటున్నారు. ప్రతీ నెలా మొదటి, మూడో శనివారాల్లో బ్యాంక్‌లు తెరిచి ఉంటున్నాయి.