UPI: యూపీఐతో రాంగ్ పేమెంట్ చేశారా..? ఇలా డబ్బుని తిరిగి పొందొచ్చు..!

-

ఈరోజుల్లో ప్రతీ ఒక్కరు డిజిటల్ ట్రాన్సక్షన్స్ మీదే ఆసక్తి చూపిస్తున్నారు. దానితో బ్యాంకుకు వెళ్లకుండానే చిటికె లో పేమెంట్స్ చేసేస్తున్నారు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ ద్వారా ఫోన్ ఉంటే చాలు క్షణాల్లో మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఎవరికీ అయితే పేమెంట్ చేస్తున్నారో వాళ్ళ యూపీఐ ఐడీ, క్యూఆర్ కోడ్, ఫోన్ నంబర్ ఉంటే చాలు. క్షణాల్లో డబ్బులని పంపేయచ్చు. అయితే ఒక్కోసారి యూపీఐ ఐడీ లేదా, ఫోన్ నంబర్ ఎంటర్ చేసేటప్పుడు పొరపాటు జరగొచ్చు. ఒకరికి పంపించబోయి మరొకరికి డబ్బులని సెండ్ చేసేస్తూ ఉంటాము. అలా పంపిన డబ్బులు తిరిగి రావా…? ఈ విషయాన్నీ చూస్తే..

ఇలా మిస్టేక్ చేసినా కూడా ఆందోళన చెందక్కర్లేదు. ఫిర్యాదు చేసి మీ డబ్బును మీరు తిరిగి పొందవచ్చు.  ఇక మరి అది ఎలా అనేది చూసేద్దాం. పేమెంట్ చేసిన తర్వాత మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయంటే మీ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. దాన్ని సేవ్ చేసి పెట్టుకోండి. డబ్బులని వాపసు పొందడం కోసం ఇది కావాలి. మీరు యాప్ నుంచి డబ్బు పంపించిన వివరాలను స్క్రీన్ షాట్ తీసుకోండి. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం ఏ యాప్ నుండి అయితే డబ్బులని పంపారో ఆ యాప్‌లోని కస్టమర్ సర్వీస్ నంబర్ ద్వారా సమస్యని చెప్పాలి.

ప్రతి యాప్ కూడా కస్టమర్ సర్వీస్ మెకానిజంను నిర్వహిస్తుంటుంది. డబ్బు పంపించిన వెంటనే కస్టమర్ సర్వీసును సంప్రదించాల్సి వుంది. డబ్బులు వాపస్ చేయాలని కోరాలి. యూపీఐ యాప్ కస్టమర్ సపోర్ట్ లభించకపోతే ఎన్‌పీసీఐ పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. npci.org.in వెబ్ సైట్‌కి వెళ్లి what we do ట్యాబ్‌లో యూపీఐపై క్లిక్ చేసి.. కంప్లయిట్ సెక్షన్‌లో మీ కంప్లయింట్ ని ఇవ్వండి. bankingombudsman.rbi.org.in వెబ్ సైట్ లోకి వెళ్లి కూడా ఫిర్యాదు చేయవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news