పాకిస్తాన్ మాజీ ప్రధాని, పిటిఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్ ను మంగళవారం అరెస్టు చేశారు. ఇస్లామాబాద్ లో పాక్ రేంజర్లు ఇమ్రాన్ ఖాన్ ని కోర్టులో హాజరు పరిచిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఇమ్రాన్ ని అరెస్ట్ చేసేందుకు గతంలో చాలా సార్లు ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆయనను అరెస్టు చేయడం సాధ్యం కాలేదు.
ఇమ్రాన్ పై పదుల సంఖ్యలో కేసులు కూడా నమోదు అయ్యాయి. గతంలో లాహోర్ లోని అతడి నివాసంలో అరెస్టు చేసేందుకు పోలీసులు విఫల యత్నం చేశారు. ఆ సమయంలో అతని మద్దతు దారులు, పోలీసులకు మధ్య తీవ్ర హింసాత్మక ఘర్షణలు ఏర్పడ్డాయి. ఇప్పుడు హైకోర్టు ఆవరణలో ఇమ్రాన్ ని అదుపులోకి తీసుకోవడంతో అక్కడ ఉధృక్త పరిస్థితులు నెలకొన్నాయి.