కర్ణాటకలో శక్తి యోజన స్కీమ్ ప్రారంభం.. ఇక నుంచి మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ

-

కన్నడ నాట ఎన్నికలు ఎంత నాటకీయంగా జరిగాయో తెలిసిందే. ఎన్నికలే కాదు ఆ తర్వాత సీఎం ఎన్నిక కూడా అంతే నాటకీయంగా జరిగింది. అయితే కన్నడ ప్రజల మనసు దోచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఉచిత హామీలు గుప్పించి. తాజాగా అందులో ఓ హామీని నిలబెట్టుకుంది.

కర్ణాటకలోని మహిళలు ఇకపై ఉచితంగా బస్సులో ప్రయాణించొచ్చు. రాష్ట్రంలోని మహిళలంతా ఉచితంగా బస్సులో ప్రయాణించేలా శక్తి పథకాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆదివారం విధాన సౌధ వద్ద జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కండక్టర్​గా మారి ఉచిత టికెట్లు ఇచ్చారు. మెజెస్టిక్‌ నుంచి విధానసౌధ వరకు బస్సులో ప్రయాణించారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్​, సహా పలువురు మంత్రులు హాజరయ్యారు.

బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, కల్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ పరిధిలో నడుపుతున్న బస్సుల్లో ఈ శక్తి పథకం ప్రయోజనాలను పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. మహిళా ప్రయాణికులు ప్రయాణించే దూరాన్ని బట్టి.. ఆయా రోడ్డు ట్రాన్స్​ప్రోర్ట్​ కార్పొరేషన్లకు రీయింబర్స్​మెంట్​ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news