దేశ భవిష్యత్ నిర్ణయించేది యువ ఓటర్లే : ప్రధాని మోడీ

-

భారతదేశ భవిష్యత్ ను నిర్ణయించేది యువ ఓటర్లేనని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం దేశాన్ని అంధకారం నుంచి బయటికి తీసుకొచ్చిందని తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా బీజేపీ యువమోర్చ ఆధ్వర్యంలో యువ ఓటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని వర్చువల్ గా ప్రసంగించారు. రాబోయే 25 ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి చేసే బాధ్యత యువతపైనే ఉందన్నారు. 

కుటుంబ పాలన, బంధు ప్రీతి ప్రాధాన్యంగా కొన్ని పార్టీలు రాజకీయాల్లో యువత ఎదుగుదలను అడ్డుకున్నాయి. ఓటు హక్కుతో మీరంతరూ కుటుంబ పార్టీలను ఓడించాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత అవకాశాల గురించి యువత చర్చించుకుంటోంది. పదేళ్లకు ముందు వారి భవిష్యత్ ను అప్పటి ప్రభుత్వాలు అంధకారంలోకి నెట్టేశాయి. డిజిటల్ ఇండియా, స్టార్టప్ నినాదంతో మేము అవకాశాలు కల్పించాం. మీ కలలను నెరవేర్చడమే నా లక్ష్యం అన్నారు ప్రధాని మోడీ. మోడీ గ్యారెంటీ  ప్రధాని అని.. కేంద్రంలో పదేళ్లుగా స్థిరమైన ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్లనే ఆర్టికల్ 370, జీఎస్టీ అమలు, మహిళా బిల్లు, ట్రిపుల్ తలాక్ వంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news