నేటి బంగారం, వెండి ధరలు..!

-

గత కొన్ని రోజులుగా తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ నిలకడగానే ఉన్నాయి. నిన్నటి ధరలే ఇవాళ కూడా కొనసాగడంతో.. పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక బంగారం బాటలో నడిచిన వెండి ధర కూడా పడిపోయింది. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నిన్న బంగారం ధర రూ. 80 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 53,350 కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల ధర రూ. 70 తగ్గడంతో రూ. 48,910 కు చేరుకుంది. ఇవాళ కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఇక బంగారం బాటలోనే వెండి కూడా ప్రయాణించింది.

కేజీ వెండి ధర నిన్న రూ. 80 తగ్గిపోయింది. దీంతో ధర రూ. 67,900 కు చేరింది. ఇవాళ కూడా అదే ధర నడుస్తుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ. 40 మేర తగ్గడంతో రూ. 54,390 చేరుకుంది. అలాగే రూ. 40 తగ్గుదలతో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,860 కి దిగొచ్చింది. నేడు కూడా అదే బాటలో నడుస్తుంది. ఇక అంతర్జాతీయంగా చూసుకుంటే బంగారం ధర ఔన్స్‌ కు 1950 డాలర్లకు చేరగా. వెండి ధర ఔన్స్‌ కు 26.98 డాలర్లకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news