గుడ్ న్యూస్ : దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..!

-

గత కొన్ని రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న బంగారం ధర.. ఇవాళ కూడా దిగొచ్చింది. పడిపోయిన బంగారం ధర చూసి పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక బంగారం బాటలో నడిచిన వెండి ధర కూడా పడిపోయింది. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ. 290 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 53,430 కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల ధర రూ. 270 తగ్గడంతో రూ. 48,980 కు చేరుకుంది. ఇక బంగారం బాటలోనే వెండి కూడా ప్రయాణించింది.

కేజీ వెండి ధర రూ. 580 తగ్గిపోయింది. దీంతో ధర రూ. 67,980 కు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ. 390 మేర తగ్గడంతో రూ. 54,430 చేరుకుంది. అలాగే రూ. 350 తగ్గుదలతో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,900 కి దిగొచ్చింది. ఇక అంతర్జాతీయంగా చూసుకుంటే బంగారం ధర ఔన్స్‌ కు 1948 డాలర్లకు చేరగా. వెండి ధర ఔన్స్‌ కు 26.91 డాలర్లకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news