మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు..!

-

గత కొన్ని రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న బంగారం ధర.. ఇవాళ కూడా దిగొచ్చింది. పడిపోయిన బంగారం ధర చూసి పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక బంగారం బాటలో నడిచిన వెండి ధర కూడా పడిపోయింది. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ. 80 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 53,350 కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల ధర రూ. 70 తగ్గడంతో రూ. 48,910 కు చేరుకుంది. ఇక బంగారం బాటలోనే వెండి కూడా ప్రయాణించింది.

కేజీ వెండి ధర రూ. 80 తగ్గిపోయింది. దీంతో ధర రూ. 67,900 కు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ. 40 మేర తగ్గడంతో రూ. 54,390 చేరుకుంది. అలాగే రూ. 40 తగ్గుదలతో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,860 కి దిగొచ్చింది. ఇక అంతర్జాతీయంగా చూసుకుంటే బంగారం ధర ఔన్స్‌ కు 1947 డాలర్లకు చేరగా. వెండి ధర ఔన్స్‌ కు 26.87 డాలర్లకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news