ఆగస్టు 2 న కరోనా సోకడంతో గురుగ్రామ్ వేదాంత ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకుని ఆగస్టు 14 వ తేదీన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే అనారోగ్యం కారణంగా మళ్ళీ ఆగస్టు 18 న ఆయన ఎయిమ్స్ లో చేరారు. దాదాపు రెండు వారాలు చికిత్స తీసుకుని ఆగస్టు 31న డిశ్చార్జయ్యారు. అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా అమిత్ షా మరోసారి ఆసుపత్రిలో చేరారు.
శనివారం అర్ధరాత్రి శ్వాస సంబంధ సమస్యలతో ఆయన ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తోంది. వీవీఐపీల కేటాయించిన సీఎస్ టవర్‌లో చేర్చి చికిత్స అందుస్తున్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఆధ్వర్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. అతని పరిస్థితి నిలకడగానే ఉందని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి.