గుడ్ న్యూస్ : భారీగా పడిపోతున్న బంగారం.. పైకి కదిలిన వెండి..!

-

బంగారం ధర భారీగా పతనమైంది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర.. నేడు కూడా దిగొచ్చింది. వరుసగా క్షీణిస్తున్న బంగారం ధర చూసి గోల్డ్ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ. 390 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 53,660 కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల ధర రూ. 290 తగ్గడంతో రూ. 49,190 కు చేరుకుంది.

కాగా, బంగారం ధర తగ్గుతుంటే.. వెండి ధర మంత్రం పైకి కదిలింది. కేజీ వెండి ధర రూ. 50 పెరిగింది. దీంతో ధర రూ. 65,550 కు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ. 490 మేర తగ్గడంతో రూ.54,380 చేరుకుంది. అలాగే రూ.410 తగ్గుదలతో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,850 కి దిగొచ్చింది. ఇకపోతే బంగారం ధర ఔన్స్‌ కు 1957 డాలర్లకు పడిపోయింది. వెండి ధర ఔన్స్‌ కు 27.39 డాలర్లకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news