పేమెంట్స్ బ్యాంక్ క‌స్ట‌మ‌ర్ల‌కు శుభవార్త‌.. అకౌంట్ లిమిట్ పెంపు..!

Join Our Community
follow manalokam on social media

దేశ‌వ్యాప్తంగా ఉన్న పేమెంట్స్ బ్యాంక్‌ల‌కు చెందిన క‌స్ట‌మ‌ర్ల‌కు ఆర్‌బీఐ శుభ‌వార్త చెప్పింది. అకౌంట్ లిమిట్‌ను పెంచుతున్న‌ట్లు తెలియ‌జేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ బ్యాంక్ అకౌంట్‌ల‌కు గాను డే ఎండ్ లిమిట్ రూ.1 ల‌క్ష వ‌ర‌కు ఉండేది. కానీ దాన్ని రూ.2 ల‌క్ష‌లు చేశారు. దీంతో ఆ మేర వినియోగ‌దారులు ఆయా అకౌంట్ల‌లో లావాదేవీలు చేయ‌వ‌చ్చు. ఆర్‌బీఐ బుధ‌వారం ఈ ప్ర‌క‌ట‌న చేసింది.

good news for paytm payments bank users account limit increased

క‌రోనా నేప‌థ్యంలో చాలా మంది ఇబ్బందులు ప‌డుతున్నారు. అందువ‌ల్లే పేమెంట్స్ బ్యాంక్‌ల‌కు చెందిన అకౌంట్ల‌ను వాడుతున్న‌వారికి లిమిట్‌ను పెంచిన‌ట్లు ఆర్‌బీఐ తెలియ‌జేసింది. దీని వ‌ల్ల ఎంతో మందికి ఉప‌యోగం క‌లుగుతుంది. ఎక్కువ మొత్తంలో లావాదేవీల‌ను నిర్వ‌హించ‌వ‌చ్చు.

కాగా దేశంలో డిజిట‌ల్ చెల్లింపుల‌ను ప్రోత్స‌హించాల‌నే ఉద్దేశంతో ఆర్‌బీఐ పేమెంట్స్ బ్యాంక్‌ల‌ను నిర్వహించేందుకు ప‌లు సంస్థ‌ల‌కు అనుమ‌తులు ఇచ్చింది. ఇవి సాధార‌ణ బ్యాంకుల లాగే ప‌నిచేస్తాయి. కానీ కొన్ని ఆంక్ష‌లు ఉంటాయి. క‌స్ట‌మ‌ర్ల‌కు లోన్లు, క్రెడిట్ కార్డులు వంటివి ఇవ్వ‌రాదు. కానీ ఇత‌ర అకౌంట్ సేవ‌లు ల‌భిస్తాయి. ఏటీఎం కార్డుల‌ను వాడుకోవ‌చ్చు. ఆన్‌లైన్‌లో న‌గ‌దును పంపుకోవ‌చ్చు. బిల్లు చెల్లింపులు చేయ‌వ‌చ్చు. రీచార్జిలు చేసుకోవ‌చ్చు. నెట్‌బ్యాంకింగ్ సేవ‌ల‌ను ఉపయోగించుకోవ‌చ్చు. ఈ బ్యాంకు అకౌంట్ల‌లో సేవింగ్స్, క‌రెంట్ అకౌంట్స్ రెండూ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్నాయి. ఇక పేటీఎం, ఎయిర్‌టెల్, ఇండియా పోస్ట్ లు పేమెంట్స్ బ్యాంక్ సేవ‌ల‌ను అందిస్తున్నాయి.

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...