పెన్షన్లు తీసుకునే వృద్ధులకు ఎట్టకేలకు కేంద్రం శుభవార్త ప్రకటించింది. ఇక మీద ప్రభుత్వం తమకు అందించే డిజిటల్ లైఫ్ ధృవపత్రాలు (DLC) సర్టిఫికెట్లను ఇంటివద్దే సమర్పించవచ్చని ఇండియా పోస్టు వెల్లడించింది. ఇందుకోసం పెన్షనర్ల సంఘాలు, బ్యాంకులు, యూఐడీఏఐలతో పోస్టల్ డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకోనుంది.
జిల్లా కేంద్రాల్లో స్మార్ట్ ఫోన్ ద్వారా పెన్షనర్లు డీఎల్ సీలు సమర్పించవచ్చు. రాలేని వారికి ఇంటి వద్దే సేవలు అందించనున్నారు. నవంబర్ 1 నుంచి 30 వరకు డీఎల్సీ క్యాంపెయిన్‌ను దేశంలో ఇండియా పోస్ట్ నిర్వహించనుంది. దీని ద్వారా వృద్ధులు డీఎల్సీ ధృవపత్రం కోసం ఇకమీదట ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఈ సేవలు వారికి నిజంగా ఎంతగానో సహయం చేయనున్నాయి. ఒకవేళ పెన్షన్ తీసుకునే వృద్ధులు ఎవరైనా మరణిస్తే ఆ వివరాలు నమోదు చేసుకుని వారి పెన్షన్ తొలగిస్తారు.