హరీష్ రావు, కౌశిక్ రెడ్డిల ఇంటికి కేటీఆర్.. షెడ్యూల్‌ ఇదే

-

అమెరికా నుంచి హైదరాబాద్‌ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇవాళ బిజీ షెడ్యూల్ గడుపనున్నారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు కోకాపేటలో ఎమ్మెల్యే హరీష్ రావును పరామర్శిస్తారు కేటీఆర్‌. అనంతరం 11 గంటలకు కొండాపూర్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శిస్తారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

KTR to the house of Harish Rao and Kaushik Reddy

ఇక ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు నాగర్ కర్నూల్ జిల్లా, తిమ్మాజీపేట మండలం, ఆవంచ గ్రామంలో జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సతీమణి అనారోగ్యంతో ఇటీవల మరణించిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

కాగా రెండు వారాల అమెరికా పర్యటన తర్వాత హైదరాబాద్ వచ్చిన బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. నందినగర్‌ వెళ్లారు. కాసేపటి క్రితమే.. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు చేరుకున్న బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌..తన ఇంటికి పయనం అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news