నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా పెరిగిన రైల్వే పోస్టులు

-

రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోస్టుల సంఖ్యను మూడింతలు పెంచుతూ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే.. అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల సంఖ్యను భారీగా పెంచుతున్నట్లు RRB ప్రకటించింది. తొలుత 5,696 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వగా తాజాగా 18,799 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

అత్యధికంగా సౌత్ సెంట్రల్ రైల్వే (సికింద్రాబాద్)లో 1,364 పోస్టులు పెరిగాయి. కాగా, ఇప్పటికే రైల్వే ఉద్యోగార్థులకు వయోపరిమితిని 30 నుంచి 33 కి పెంచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్లికేషన్ ప్రక్రియ పూర్తి కాగా, జులై-ఆగస్టులో CBT-1 పరీక్ష ఉండనుంది. పూర్తి వివరాలకు https://www.rrbcdg.gov.in/ సైట్ చూడండి. కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 19,900- రూ.63,200 పే స్కేలు చెల్లిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news