సింగరేణి గని అంటే.. ఉద్యోగాల గని: డిప్యూటీ సీఎం భట్టి

-

బీఆర్ఎస్, బీజేపీ నేతల మాటలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల తీరు దొంగే దొంగ అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. సింగరేణి గని అంటే ఉద్యోగాల గని అని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు. సింగరేణి తెలంగాణకే తలమానికమని చెప్పారు. ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క బొగ్గు గనుల వేలం ప్రక్రియ గురించి మాట్లాడారు.

సింగరేణిలో 42 వేల మంది రెగ్యులర్‌, 6 వేలమంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని 40 బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించారు. ప్రస్తుతం 70 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని వివరించారు. 2030 కల్లా 15 మిలియన్‌ టన్నులకు బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గనుల చట్టానికి కేంద్రం సవరణలు తీసుకొచ్చి ఆమోదించుకుందని.. బొగ్గు గనులు కావాలంటే ఎవరైనా వేలంలో పాల్గొనేలా చట్టం చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు దేశంలోని బొగ్గు గనులను కేటాయించలేదని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news